అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు  నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కోన రఘుపతి ఈ పదవికి నామినేషన్  దాఖలు చేశారు.

రఘుపతి నామినేషన్ ను బలపరుస్తూ పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  పదవికి ఎన్నికలు జరగనున్నాయి.