Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అలా-లోకేష్ ఇలా... వారిమధ్య ఐక్యత లేదనేందుకు నిదర్శనమదే: అమర్నాథ్ రెడ్డి

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వుండివుంటే పరిస్థితి మరోలా వుండేదని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. 

YSRCP MLA Gudiwada Amarnath Reddy Shocking Comments on Chandrababu and Lokesh
Author
Amaravathi, First Published Apr 18, 2020, 4:58 PM IST

గుంటూరు: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కు పట్టిన 40 ఏళ్ల పొలిటికల్ వైరస్ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కరోనా వైరస్  కొన్ని నెలల తర్వాత అయినా తగ్గుతుంది కానీ ఈ చంద్రబాబు వైరస్ తగ్గేది కాదని... చాలా ప్రమాదకరమైనదని ఎద్దేవా చేశారు.  

జనతా కర్ఫ్యూ రోజున చంద్రబాబు తన మనవడికి ఇంగ్లీష్ బోధన చేస్తున్న వీడియో చూశామని... కానీ రాష్ర్టంలో పేద విద్యార్దులకు ఇంగ్లీష్ మీడియం రాకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. దీపాలు వెలిగించమంటే చంద్రబాబు దీపం, కొడుకు తోకేష్ కొవ్వొత్తి, మనవడు టార్చ్ లైట్ పట్టుకున్నారని... ఆయన ఇంట్లోనే ఐక్యత లేదన్నారు. అలాంటిది ఆయన అఖిలపక్షం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు విరాళాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని... హుద్ హుద్ తుఫాన్ నుంచి రాజధాని నిర్మాణం వరకు చందాలు వసూలు చేసిన ఘనత ఆయనదేనని విమర్శించారు. ఆయన పేరు చందాల నాయుడు అని ఉంటే బాగుండేదేమో అని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబుతో పాటు ఆయన పత్రికలుఈనాడు, ఆంద్రజ్యోతి కూడా పలు సందర్భాలలో చందాలు వసూలు చేశాయని...వాటి లెక్కలు ఎపుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే 600 కోట్లు ఇస్తే అందులో 200 కోట్ల రూపాయిలని కూరగాయలు కొనుగోలు చేశామని హోంమంత్రి అసెంబ్లీలో దొంగలెక్కలు చెప్పలేదా...? అని నిలదీశారు. 

''చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గబ్బిలం. విశాఖలో కరోనా కేసులు దాచిపెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తున్నారు. అయ్యన్నకి మందు దొరక్క ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. విశాఖలో పాజిటివ్ కేసులు దాచాల్సిన అవసరం ఏముంది. మీ నాయకుడి మెప్పుకోసం విశాఖపై తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దు.యుద్దంలో గెలిచినా...ఓడినా వీరుడంటారు...కానీ ఆట మధ్యలో వెళ్లిపోయిన వారిని ఏమంటాం...ఆటలో అరటిపండు అంటాం...పవన్ కళ్యాణ్ చేసిన చేసిన విమర్శలు సైతం ఆటలో అరటి పండులాంటివే'' అంటూ అయ్యన్నపాత్రుడు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. 

''కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందించి ఐకమత్యం ప్రదర్శించారు. దేశాన్ని కాపాడాలనే ప్రజల చిత్తశుధ్ది చూస్తే వారికి చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తోంది. ప్రపంచాన్ని శాసిస్తామని చెప్పిన కొన్ని దేశాలు నేడు కరోనాతో  వణికిపోతున్నాయి. 30 కోట్లు జనాభా ఉండే అమెరికా లాంటి దేశంలో నేటికి 6 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి'' అని తెలిపారు. 

'' ఇటలీ ,జర్మనీ,స్పెయిన్ లాంటి దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మంచి వైద్యసేవలందించే ఇటలీ నేడు ఏ స్దితిలో ఉందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్దితుల్లో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.  మన రాష్ట్రం, ముఖ్యమంత్రి జగన్ ఒంటిచేత్తో రాష్ర్టంలోని ప్రజలను కాపాడాలని  చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. గ్రామ సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్ధ  వల్ల ఈరోజు ఏరకంగా ఆంధ్రరాష్ర్టంలో ప్రతి ఇల్లు జల్లెడపట్టి ఎక్కడ ఏ రకమైన పరిస్దితులు ఉన్నాయో తెలుసుకుని ఆయా కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు'' అని తెలిపారు. 

'' ప్రస్తుతం ఆరోగ్యసేవలలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏపి. చంద్రబాబు మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.అయినప్పటికీ   జగన్ అండగా నిలబడి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి జగన్ గారికి పబ్లిసిటి చేసుకోవాల్సిన అవసరం లేదు. మాది మేటర్ పీక్ పబ్లిసిటి వీక్. చంద్రబాబు మేటర్ వీక్ పబ్లిసిటి పీక్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో సైతం చెప్పాం'' అని మండిపడ్డారు. 

''చంద్రబాబు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే మీడియావారికి ఖాళీ ఉండకపోదు.  ప్రతి నిమిషం ప్రెస్ మీట్, అదికారులతో సమీక్షలు, సమావేశాలు, వాటిపై ఆర్భాటాలు ,హంగులు  చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకునే పరిస్ధితులు ఉండేవి. కాని మాకు రాష్ర్ట ప్రజల ఆరోగ్యం,వారి భవిష్యత్తు ముఖ్యం,  మేలైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనే తాపత్రయంతో జగన్ పనిచేస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

''ఆపత్కాలంలో ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూస్తుంటే బాధ అనిపిస్తోంది.ఆశ్చర్యం కలుగుతుంది.  ప్రపంచంలోగాని, దేశంలోగాని ఇతర రాష్ట్రాల్లో గానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఇంతలా ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కరకట్టకి పారిపోయారు.ఇప్పుడు ఆశ్రయమిచ్చిన రాష్ట్రానికి ఆపద వస్తే మళ్లీ హైదరాబాద్ పారిపోతారా?'' అంటూ అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios