తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానానికి కేసీఆర్ కుటుంబసభ్యులు బయలుదేరారు.

అయితే వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా కోరడంతో కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు వెళ్లనున్నారు.

అంతకు ముందు సోమవారం తెల్లవారుజామున కేసీఆర్ కుటుంబసభ్యులు ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్‌కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు.