గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలనం

కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవులను ఆహారవస్తువుగా చూస్తారన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడ ఈ చట్టం లేదని ఆయన గుర్తు చేశారు.

YSRCP MLA Chennakeshava Reddy sensational comments on cow slaughter lns

కర్నూల్: గోవధ చట్టాన్ని ఎత్తివేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేశారు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి  శనివారం నాడు గోవధపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన చట్టాల్లో  గోవధ చట్టం కూడ ఒకటని ఆయన అబిప్రాయపడ్డారు.

ప్రపంచంలో ఎక్కడా కూడ గోవధ చట్టం అమల్లో లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని తాను వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పడం లేదన్నారు. ఓ లౌకికవాదిగా చెబుతున్నానని ఆయన తెలిపారు.  గోవులను అన్ని దేశాల్లో ఆహార వస్తువుగా ఉపయోగిస్తున్నారన్నారు.పురాణాల్లో మునులు కూడా గోవులను తిన్నట్టుగా తాను విన్నానని వ్యాఖ్యానించారు. మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం సరి కాదన్నారు.

గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్లుగా మన చట్టాల్లో ఈ కాలానికి అవసరం లేని చట్టాలు తొలగించాలని సూచించారు.గోవధ చట్టంపై వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై  బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios