Asianet News TeluguAsianet News Telugu

వీఆర్ఏ, వీఆర్‌వోలు గ్రామాలకు పట్టిన పీడ.. వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

ysrcp mla chennakesava reddy sensational comments on revenue department
Author
First Published Dec 31, 2022, 6:19 PM IST

ఏపీలో అధికార వైసీపీకి చెందిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రెవెన్యూ శాఖను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని చెన్నకేశవ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్లను అటెండర్లుగా పంపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.     

ALso REad: గోవును అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు.. నా వ్యాఖ్యలతో వైసీపీకి సంబంధం లేదు: చెన్నకేశవ రెడ్డి

అయితే చెన్నకేశవ రెడ్డి గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.  మైనార్టీలను వ్యతిరేకించే బీజేపీ గోవును అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తోందని చెన్న కేశవ రెడ్డి ఆరోపించారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు సైతం దిగాయి. అలాగే దేశంలో మోడీని ఢీకొన్న మొనగాడు కేసీఆరేనంటూ చెన్నకేశవ రెడ్డి ప్రశంసలు కురిపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపైకి వచ్చి .. మోడీని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios