Asianet News TeluguAsianet News Telugu

జడ్జిలుగా బీసీలు పనికి రారని చంద్రబాబు లేఖ రాయలేదా..?: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కౌంటర్

గత 40 ఏళ్లుగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదని విమర్శించారు. బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. 

ysrcp mla anil kumar yadav fires chandrababu naidu
Author
Nellore, First Published Feb 18, 2019, 6:48 PM IST

నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. బీసీ గర్జన సభతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. 

సభ విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారని విమర్శించారు. అందువల్లే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే  అర్థం కావడం లేదని విమర్శించారు. సభకు జనం రాలేదని, అట్టర్‌ ఫ్లాఫ్‌ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఘాటుగా విమర్శించారు. 

సభ ప్లాప్ అంటే జనాలు నవ్వుతారని అనిల్ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌కు బీసీలంతా అండగా ఉన్నారని 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో మోసోయిన బీసీ సోదరులంతా జగన్‌ సీఎం అయిన తర్వాత లాభపడతారని తెలిపారు. 

గత 40 ఏళ్లుగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదని విమర్శించారు. బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల స్థితిగతులు మారుస్తామని ఐదేళ్లలో రూ. 75వేల కోట్లతో బీసీలను అభివృద్ధి చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క కుకలానికి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యలేని చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి కార్పొరేసన్లు అంటూ మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి పూర్వవైభవాన్ని తీసుకువస్తామన్నారు. అటు నామినేటెడ్‌ పదవుల్లో కేటాయింపులోనూ చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. 

జడ్జిలుగా బీసీలు పనికి రారని లేఖలు రాశారని ఆరోపించారు. నామినేటడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అవకాశం కల్పించేలా చట్టబద్దత చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios