అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది.

సత్తెనపల్లి ఆసుపత్రిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నారు. తొలుత నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత చేసిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.గుంటూరు జిల్లాలోనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఇదే జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. కరోనా నుండి రోశయ్య కోలుకొన్నారు. శివకుమార్ క్వారంటైన్ కే పరిమితమయ్యారు. 

రాష్ట్రంలో మంగళవారం వరకు  58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనా సోకి ఇప్పటి వరకు 25,574 మంది కోలుకొన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు  758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 13,86,274 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.