Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్యే Ambati Rambabuకు కరోనా పాజిటివ్.. వీడియో‌ విడుదల.. ఏం చెప్పారంటే..

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu)  కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

YSRCP MLA ambati rambabu tested covid Positive
Author
Guntur, First Published Jan 16, 2022, 11:13 AM IST

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu)  కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టుగా చెప్పారు. ‘జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటే ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా వచ్చింది. క్వారంటైన్ ట్రీట్‌మెంట్‌కు వెళ్తున్నా. ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని ఈ వీడియో చేస్తున్నాను’ అని అంబటి రాంబాబు ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఇక, గతంలో కూడా అంబటి రాంబాబు రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత ఆయనకు కరోనా సోకగా.. ఆ తర్వాత రీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆ సమయంలో ఆయన కరోనాను విజయవంతంగా జయించారు. 

అయితే శుక్రవారం రోజు భోగి పండగ సందర్భంగా జరిగిన వేడుకల్లో.. అంబటి రాంబాబు ఉత్సాహంగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలకు అనుగుణంగా గిరిజన మహిళలతో ఉత్సాహంగా కాలు కదిపారు. భోగి పండుగ నాడు అందరి మధ్య సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని అంబటి రాంబాబు తెలిపారు. 

అయితే ఇది జరిగిన రెండు రోజులకే అంబటి కరోనా బారినపడటంతో ఆయనను కలిసిన వారి ఆందోళన చెందుతున్నారు. ఇక, ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబుకు తీవ్ర లక్షణాలు ఏమి లేవని ఆయన విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. 

 

ఇక, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 4,955 కరోనా కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,01,710కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు నమోదైనట్టుగా ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో ఒకరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 14,509కి చేరింది. 

తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 397 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,64,331కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios