Asianet News TeluguAsianet News Telugu

బాబు చీకట్లో చిదంబరాన్ని కలిశారు.. మేం కేసులకు భయపడం: అంబటి

టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారని స్పష్టం చేశారు

ysrcp mla ambati rambabu fires on tdp chief chandrababu naidu
Author
Amaravathi, First Published Oct 8, 2020, 3:49 PM IST

టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారని స్పష్టం చేశారు.

వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 10 ఏళ్ల రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారని గుర్తుచేశారు.

కానీ జగన్ కేసుల గురించి భయపడరని.. మమ్మల్ని కేసులు ఏం చేయలేవని రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌పై ఉన్నవన్ని కుట్రపూరితమైన కేసులేనన్న విషయాన్ని ప్రజలు గమనించారని, అందుకే 151 సీట్లను కట్టబెట్టారని అంబటి స్పష్టం చేశారు.

జనం చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించారని..  చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే జగన్‌కు ముఖ్యమని.. కేంద్ర పదవులు మాకు అవసరం లేదని రాంబాబు కుండబద్ధలు కొట్టారు.

చంద్రబాబు మారకుంటే మళ్లీ ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రజ్యోతి కథనంలో అసలు జర్నలిజం విలువలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

ప్రధానికి  ఎవరైనా కోర్టులపై ఫిర్యాదు చేస్తారా? అని రాంబాబు ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలిసినప్పుడల్లా ఆంధ్రజ్యోతి విషప్రచారం చేస్తోందని అంబటి నిప్పులు చెరిగారు
 

Follow Us:
Download App:
  • android
  • ios