కడప: కడప జిల్లాలోని వైసీపీలోని జమ్మలమడుగు నేతల మధ్య విభేదాలు  బయటపడ్డాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై నేతలు సీఎం జగన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి సుధీర్ రెడ్డి విజయం సాధించారు.  ఇటీవల కాలంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి కూడ వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి వర్గానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గానికి కూడ పొసగడం లేదు.

మరోవైపు పార్టీలోని మరోవర్గం కూడ ఎమ్మెల్యేతో పొసగడం లేదు. మైలవరం మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి, గన్నవరం శేఖర్ రెడ్డి, జమ్మలమడుగు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జగదేకర్ రెడ్డి, మూలే సుప్రియ తదితరులు ఆదివారం నాడు సమావేశమయ్యారు.పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని  ఆరోపించారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహరిస్తున్నతీరుపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.