వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఈవోలతో చర్చించేందుకు బుధవారం ఉమ్మారెడ్డి అక్కడికి వచ్చారు.

వారి సమస్యలు విని.. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చి ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వాంతులు కావడంతో వైసీపీ నేతలు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను ఆసుపత్రిలో పరామర్శించారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ఎంపీఈవోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.