Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎన్నికల ఫలితాలు: బాబు నోట మట్కా, బెట్టింగ్..మండిపడుతున్న వైసీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ప్రజలపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తాను ఓడిపోతాను అనుకుంటే ఈవీఎంలదే తప్పు అని తెలిసేలా దానికి ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని ఆయన మండిపడ్డారు.

ysrcp leader srikanth reddy makes comments on chandraba
Author
Hyderabad, First Published May 3, 2019, 12:44 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ప్రజలపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తాను ఓడిపోతాను అనుకుంటే ఈవీఎంలదే తప్పు అని తెలిసేలా దానికి ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చట్టవిరుద్ధమైన పనులు చేయడం సరికాదన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపొరు అనే ముసలం ఏర్పడిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును భరించలేమని టీడీపీలో కొందరు గ్రూపుగా ఏర్పడ్డారన్నారు. గ్యాంబ్లింగ్ చేసే ఒక సంస్థ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. సీఎం నోటి వెంట మట్కాలు, బెట్టింగులు అన్న మాట రావడం ఏంటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రాజకీయాలు మొదలుపెట్టిన నాటి నుంచి చీకటిలో ఉన్న వారు మద్దతు ఇస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావును ట్రాన్స్‌ఫర్ చేస్తే చంద్రబాబుకంత బాధని ఆయన ప్రశ్నించారు.

డీజీపీ బదిలీపై తాము ఈసీకి ఫిర్యాదు చేశామని.. మరి ఆ విషయంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరన్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నప్పుడు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios