ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగులను షేర్ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28న కువైట్‌లో ఉంటున్న కర్నూలుకు చెందిన ఎస్.కె హానీఫ్, నాజర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన దావూద్‌లు రాధాకృష్ణపై ఫేస్‌బుక్‌లో కొన్ని అసభ్యకర, అభ్యంతరకర పోస్టింగులు పెట్టారు.

వీటిని ఒంగోలుకు చెందిన వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖుర్దూష్ కుమారుడు అబ్ధుల్ హఫీజ్ షేర్ చేశాడు. దీనిపై ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచి మేనేజర్ ఐవీ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఐటీ చట్టం 67 (ఎ), ఐపీసీ సెక్షన్ 500, 506 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హాఫీజ్‌ను అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు.