Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల టైంలో వేషగాళ్లు దిగుతున్నారు.. చంద్రబాబు ఆ విషయంలో దిట్ట : సజ్జల వ్యాఖ్యలు

అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మధ్య పెట్టడంలో చంద్రబాబు దిట్టని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి , ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీసీలంటే బ్యాక్‌బోన్ క్లాస్‌గా జగన్ పేర్కొన్నారని.. ఎమ్మెల్సీ స్థానాల్లో సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యతనిచ్చారని సజ్జల ప్రశంసించారు. 

ysrcp leader sajjala rama krishna reddy slams tdp chief chandrababu naidu
Author
First Published Feb 22, 2023, 3:32 PM IST

విపక్షాలపై మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి , ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో మళ్లీ కొత్త వేషగాళ్లు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని అవమానించిన వ్యక్తి చంద్రబాబని సజ్జల గుర్తుచేశారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మధ్య పెట్టడంలో చంద్రబాబు దిట్టని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలంటే బ్యాక్‌బోన్ క్లాస్‌గా జగన్ పేర్కొన్నారని.. ఎమ్మెల్సీ స్థానాల్లో సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యతనిచ్చారని సజ్జల ప్రశంసించారు. 

ఇకపోతే.. ఇటీవల సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి  వచ్చిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు  ఉప ముఖ్యమంత్రి పదవులు  ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. వైసీపీ  సామాజిక న్యాయానికి  కట్టుబడి  ఉందని  పదవుల పంపకం  ద్వారా తేటతెల్లం అయిందన్నారు. ఎన్నికల్లో  ఓట్ల  కోసం  నినాదాలిచ్చే పార్టీ తమది కాదని ఆయన  తేల్చి  చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల్లో  భాగంగా  బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీల కు  పదవులు  కేటాయించినట్టుగా   సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

ALso REad: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్

శాసనమండలిలో  బీసీ సామాజిక వర్గానికి  చెందిన  ఎమ్మెల్సీల సంఖ్య  19కి  చేరుతుందని ఆయన  చెప్పారు.  ఓసీ సామాజిక వర్గానికి  చెందిన  ఎమ్మెల్సీల సంఖ్య  14కి చేరుకుంటుందని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ హయంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  శాసనమండలిలో  37 శాతం  మాత్రమే  ప్రాతినిథ్యం  ఉన్న విషయాన్ని  సజ్జల రామకృష్ణారెడ్డి  గుర్తు  చేశారు.  వైసీపీ  హయంలో  బీసీలకు  43 శాతం  ఎమ్మెల్సీ  పదవులు దక్కాయని  సజ్జల రామకృష్ణారెడ్డి  వివరించారు.  అంతేకాదు  శాసనమండలిలో  బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  48 శాతం  పదవులు  ఇచ్చిన ఘనత  వైసీపీకే దక్కుతుందని  ఆయన  చెప్పారు.  సామాజిక సాధికారిత  అంటే తమదేనని  ఆయన  చెప్పారు. చంద్రబాబునాయుడు మాటల్లో  చెబితే  వైఎస్ జగన్  ఆచరించి  చూపారన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios