వ్యక్తిగత దూషణలపై ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి.. తాను మాట్లాడాల్సింది మీరు రాసివ్వాలంటూ స్పీకర్‌తో వ్యాఖ్యానించడంతో సభాపతి తమ్మినేని మండిపడ్డారు.

దీనిపై వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు అభ్యంతరం తెలిపారు. సభాపతి స్ధానాన్ని అచ్చెన్నాయుడు అగౌరవపరిచారని ఎద్దేవా చేశారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసినప్పుడు ఆమెను ఒక్క మాట కూడా మాట్లాడేందుకు వీలు లేదన్నట్లుగా నాటి టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఐదేళ్లలో భారతదేశ చరిత్రలో ఏ అసెంబ్లీ జరగని విధంగా ఏపీ శాసనసభ నడిచిందని భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్‌ నుంచి పదవి లాక్కుని ఆయనకు సైతం చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.