అమరావతి: ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవులను తొలగించడం వల్లనే వేటు వేశారంటూ వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. 

క్రైస్తవులు పూజలు చేశారని ఫలితంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ముత్తయ్య మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు జూపూడి ప్రభాకర్ రావు. 

కులాల వారీగా మతాల వారీగా ప్రజలను విభజించి సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. సీఎస్ బదిలీపై లగుట్టు దాగి ఉందని దాన్ని బయటపెడతామని టీడీపీ నేతలు చెప్తున్నారని బయటపెట్టాలని సవాల్ విసిరారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీపై సీఎం జగన్ ను తప్పుబడుతూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఎల్లోమీడియా కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎస్ పరిధి దాటారని, సీఎంవోకే తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారని ఆరోపించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిధి దాటి ప్రవర్తించడం వల్లే ఆయనపై బదిలీవేటు పడిందన్నారు. అందులో ఎలాంటి తప్పు ఉండదన్నారు.  అధికారులపై బదిలీలు సహజమేనని అందులో కుట్రలు, కుతంత్రాలు ఏముంటాయన్నారు జూపూడి ప్రభాకర్ రావు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు: రిలీవ్ అయిన ఎల్వీ

జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్