Asianet News TeluguAsianet News Telugu

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులను కాపాడేది ఆయనే: అంబటి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ద్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ‌ను నడిపిందే టిడిపి నాయకులని అంబటి రాంబాబు ఆరోపించారు. అయితే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని  స్వయంగా ముఖ్యమంత్రి  చంద్రబాబే వారిని కాపాడుతున్నారని అన్నారు.  రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు ఎల్లో డిపార్ట్‌మెంట్‌గా మార్చాడని అంబటి మండిపడ్డారు. 
 

ysrcp leader ambati rambabu fires on chandrababu
Author
Amaravathi, First Published Oct 22, 2018, 4:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ద్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ‌ను నడిపిందే టిడిపి నాయకులని అంబటి రాంబాబు ఆరోపించారు. అయితే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని  స్వయంగా ముఖ్యమంత్రి  చంద్రబాబే వారిని కాపాడుతున్నారని అన్నారు.  రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు ఎల్లో డిపార్ట్‌మెంట్‌గా మార్చాడని అంబటి మండిపడ్డారు. 

ఇలా పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన చంద్రబాబే పోలీసులను ఏదో ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. ఇటీవలే జరిగిన పోలీసు సంస్మరణ సభలో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకున్నారని అంబటి అన్నారు. 

టిడిపి నాయకుల ప్రమేయం వున్న ఏ కేసులో కూడా పోలీసులు స్వేచ్చగా విచారణ జరిపే అవకాశం ఇవ్వడంలేదన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని రాంబాబు ఆరోపించారు. అంతే కాకుండా తుని ఘటనలో కూడా ఈ పార్టీ నాయకుల హస్తం ఉందని అన్నారు. అందువల్లే ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదన్నారు. ఈ కేసుల్లో ప్రతిపక్ష నాయకులపై నిందమోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబటి అన్నారు.

ఓ మహిళా ఎమ్మార్వోపై టిడిపి ఎమ్మెల్యే దాడి  చేస్తే అతడిపై చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆపింది చంద్రబాబేనని అంబటి ఆరోపించారు. ఇలా మహిళల వేధింపుల్లో ఏపి నాలుగో స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఈ వేధింపుల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువగా ముద్దాయిలుగా ఉన్నారని అంబటి తెలిపారు.

పోలీసు వ్యవస్థే కాదు ఇంటేలిజెన్స్ వ్యవస్థ కూడా కేవలం టిడిపి పార్టీ కోసమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమార్కులపై అండగా నిలుస్తూ ఐటీ అధికారులకు రక్షణ కూడా కల్పించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. సీఎం పదవి కోసం చంద్రబాబు దేన్నయినా వాడుకుంటాడనడానికి ఇవే ఉదాహరణలుగా నిలుస్తాయని అంబటి తెలిపారు.

మరిన్ని వార్తలు 

సీఎం ఓ సారా కాంట్రాక్టర్...ఆయనవన్నీ గెస్ట్ హౌస్ రాజకీయాలే: అంబటి

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

మోడీ, చంద్రబాబు మహానటులు.. చంద్రబాబు జీవించేస్తారు:అంబటి

 

Follow Us:
Download App:
  • android
  • ios