వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న క్రిష్ణాజిల్లాకు చెందిన ఓ మహిళా నేత తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యింది. సొంతపార్టీలోనే తమను పక్కనపెడుతున్నారని దీంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. 

కృష్ణాజిల్లా : YCPకి చెందిన దోసపాడు MPTC సభ్యురాలు తన పదవికి resign చేయడానికి సిద్ధం కావడం చర్చనీయాంశం అయింది. ఎంపీటీసీ సభ్యురాలు చిగురుపాటి అశోక్ కుమారి విలేకరులతో మాట్లాడుతూ తన భర్త శ్రీధర్, తాను వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామన్నారు. మండల నాయకులు ప్రోత్సాహం ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై ఉన్న అభిమానంతో పార్టీని నమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు.

ఈనెల 23న దోసపాడులో వలంటీర్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా తాము ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి వేశారన్నారు. దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీలో కొంతమంది ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీలో మండల నాయకులు కొంతమంది దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోవడంతో ఎంపిటిసి పదవికి మంగళవారం రాజీనామా చేసి పత్రాలను జడ్పీ సీఈవో, ఎంపీడీవోకు పంపడం జరుగుతుందన్నారు. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు. 

ఇదిలా ఉండగా, సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సోమవారంనాడు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులున్నారు. ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేర్పులు చేసింది. ప్రభుత్వం, గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో అదనంగా ఇద్దరు సభ్యులను చేర్చుతున్నట్టుగా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇవాళ UTF సీఎం ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. అయితే యూటీఎఫ్ కార్యాలయంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి సోమవారం నాడు సాయంత్రం సచివాలయంలో Employees Association నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు జరుపుతున్న సమయంలోనే సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీని ప్రభుత్వం ప్రకటించింది.

 సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2003 చివర్లో అప్పటి వాజ్ పేయ్ ప్రభుత్వం ఈ పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది.