ఏపీ ఎస్ఈసీ యాప్: కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ
రాష్ట్ర ఎన్నికల సంఘం యాప్ పై కోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్‌పీ నిర్ణయం తీసుకొంది.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం యాప్ పై కోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్‌పీ నిర్ణయం తీసుకొంది.యాప్ పారదర్శకంగా లేదని వైఎస్ఆర్‌సీపీ అనుమానిస్తోంది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు విడుదల చేయనున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం యాప్ పై కోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్‌పీ నిర్ణయం తీసుకొంది.తమ ఫిర్యాదులు ఫిల్టర్ అయ్యే యాప్ తయారు చేశారని వైసీపీ అనుమానిస్తోంది. ప్రభుత్వ యాప్ లేదా ఈసీ యాప్ ను వినియోగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
also read:ప్రైవేట్ వాహనాల్లో తిరిగినా...: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌కి నిమ్మగడ్డ లేఖ
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి ప్రభుత్వాన్ని మధ్య ప్రచ్ఛన్న యుధ్దం సాగుతోంది. ఎస్ఈసీ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ప్రభుత్వం తిప్పిపంపింది. ఇద్దరు ఐఎఎస్ అధికారుల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ప్రోసిడింగ్స్ ను కూడ ప్రభుత్వం వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ను స్వీకర్ తమ్మినేని సీతారాం ప్రివిలేజ్ కమిటీకి సోమవారం నాడే సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరు తెన్నులను ఎస్ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.