Asianet News TeluguAsianet News Telugu

అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారు.. చంద్ర‌బాబు, పవన్ ల పై పేర్ని నాని ఫైర్

Vijayawada: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ లకు చిత్తశుద్ధి ఉంటే వారి ఆస్తులపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయ‌కుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామ‌య్య (పేర్ని నాని) డిమాండ్ చేశారు.
 

ysrcp challenges TDP to face court monitored probe into Naidu-Lokesh assets RMA
Author
First Published Oct 7, 2023, 4:53 AM IST | Last Updated Oct 7, 2023, 4:52 AM IST

YSRCP leader Perni Venkatramaiah: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ లకు చిత్తశుద్ధి ఉంటే వారి ఆస్తులపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయ‌కుడు మాజీ మంత్రి పేర్ని వెంట‌ట్రామ‌య్య (పేర్ని నాని) డిమాండ్ చేశారు. ఇదే క్ర‌మంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న వారాహి రాజకీయ యాత్రను కృష్ణా జిల్లాలో తన 'విహారయాత్ర', వినోద యాత్రగా పేర్కొంటూ పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని కాపాడేందుకు వచ్చిన పవన్ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు నిజాయితీపరులైతే వారి ఆస్తులపై కోర్టు పర్యవేక్షణలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. టీడీపీతో జనసేన పార్టీ పొత్తుపై పవన్ తన మాటల ద్వారా క్లారిటీ ఇచ్చారని, బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని ప్రకటించారు. టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసే సీట్లను ప్రకటించే ముందు పవన్ తన పార్టీ మిత్రపక్షం బీజేపీని ఎందుకు సంప్రదించలేదని, దీన్ని బట్టి పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పక్కన పెడుతున్నారని అర్థమవుతోందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేస్తానన్న పవన్ వాదనను తోసిపుచ్చిన మాజీ మంత్రి, వైయస్ హయాంలో పీకే ఎప్పుడూ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని, ఇప్పుడు ఆయన తన కార్యకర్తలలో అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్ ఎక్కడున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. న్యాయవాదులంతా విజయవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని లాబీయింగ్ చేయడానికి లోకేశ్ ఢిల్లీ వెళ్లారా? వ్యవస్థలను తారుమారు చేయడం, లాబీయింగ్ చేయడం మాత్రమే లోకేష్, చంద్రబాబు బాగా చేయగలరన్నారు. నాలుకను అదుపులో పెట్టుకోకుండా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios