శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ మంత్రి అచ్చెన్నాయుడు కంటే ముందు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ముందంజలో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.