ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కొండపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత శరత్‌చంద్ర ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కొండపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత శరత్‌చంద్ర ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. శరత్‌చంద్రతో పాటు తల్లి సుకన్యపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. శరత్‌చంద్ర ఇల్లు తమదేనంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. శరత్ చంద్ర కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నీచర్ బయటపడేసి శరత్ చంద్ర ఉంటున్న ఇంటికి వైసీపీ కార్యకర్తలు తాళం వేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred