Asianet News TeluguAsianet News Telugu

ఇడుపుల పాయలో వైఎస్ఆర్ కు ఘన నివాళి

 దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్థంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు ఘన నివాళులర్పించారు. ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిళ, అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డిలు నివాళులర్పించారు. వారితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 

ysr family pay tributes ysr ninth death anniversary
Author
Kadapa, First Published Sep 2, 2018, 1:36 PM IST


కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్థంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు ఘన నివాళులర్పించారు. ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిళ, అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డిలు నివాళులర్పించారు. వారితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 

మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి వంటి నేతలు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ చేసిన సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను పలువురు గుర్తు చేసుకున్నారు. 

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణజన్ముడని, వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ఆర్ సతీమణి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన చేసిన కార్యక్రమాలు మాత్రం ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాయన్నారు. 

ఒక కారణ జన్ముడిగా సీఎం అయ్యి ప్రజలకు ఎలాంటి సేవ చెయ్యాలో అలాంటి సేవ చేసి దేవుడిదగ్గరకు వెళ్లిపోయారన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను కాపాడేందుకు జగన్‌బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారని ఆయనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. జగన్‌ ప్రజలందరికీ అండగా ఉంటాడని....ఒక అన్నగా, తమ్ముడిగా,  మనవడిగా వెన్నంటే ఉంటాడని విజయమ్మ భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios