తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెుదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూనే ఉంది. గతంలో ఉభయగోదావరి జిల్లాలో కేవలం  5 స్థానాలకే పరిమితమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. 

తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గానూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లాలో సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది. 2014 ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవని వైసీపీ ఈసారి అత్యధిక స్థానాలు గెలిచేలా ఉంది. 

మెుదటి రౌండ్ పూర్తయ్యే సరికి పశ్చిమగోదావరి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు ఉభయగోదావరి జిల్లాలో వైసీపీ 24 స్థానాల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైసీపీ పయనిస్తోంది.