వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తన ప్రమేయం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  అలిపిరిలో వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ప్రమాణం చేశారు.

YS Vivekananda Reddy murder case:TDP General secretary Nara lokesh sworn at Alipiri  lns

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తన ప్రమేయం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  అలిపిరిలో వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ప్రమాణం చేశారు.బుధవారం నాడు అలిపిరి వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన వివేకానందరెడ్డి హత్యలో తన ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. 

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో  సంబంధం లేదని తాను ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాను. తాడేపల్లి నుండి జగన్ ఇప్పుడు బయలుదేరితే ఒక్క గంటలో  అలిపిరికి చేరుకొంటారు. ఫేస్ టూ ఫేస్ తేల్చుకొంటామని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.  దమ్మూ, ధైర్యం ఉంటే జగన్ ఇప్పుడు ఇక్కడికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. 

రక్త చరిత్ర మా కుటుంబానిది కాదన్నారు.రక్త చరిత్ర ఎవరిదో ఏపీలో అందరికీ తెలుసునని ఆయన చెప్పారు.కత్తితో బతికే వాడు కత్తితోనే చస్తాడని ఆయన చెప్పారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7వ తేదీన  సూళ్లూరుపేటలో జగన్ కు సవాల్ విసిరిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఈ నెల 14న జగన్ ఇక్కడే ఉంటాడని తిరుపతిలో ప్రమాణం చేస్తానని సవాల్ చేసినట్టుగా చెప్పారు.

వివేకానందరెడ్డి హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని లోకేష్ ప్రకటించారు.వివేకానంరెడ్డి  హత్య జరిగిన రోజున సీబీఐ దర్యాప్తు కోరిన జగన్  ఇవాళ ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదన్నారు.వివేకానందరెడ్డి తొలుత గుండెపోటుతో మరణించారని ఆ తర్వాత హత్య జరిగిందని చెప్పారన్నారు. ఈ హత్య కేసులో తమకు ప్రమేయం ఉందని జగన్  ఆ పార్టీ నేతలు ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios