Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసులో అనూహ్యమైన మలుపు

వివేకా హత్య కేసులో రెండు రోజులుగా రంగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే వాచ్‌మెన్‌ రంగయ్య వివేకాహత్య కేసులో సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. దీంతో నార్కో పరీక్షలకు తరలించారు.

YS Viveka murder case takes new turn
Author
Kadapa, First Published Jul 3, 2019, 9:54 PM IST

కడప: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. వివేకా హత్యకేసులో వాచ్‌మెన్‌ రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. నార్కో పరీక్షల కోసం రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. 

వివేకా హత్య కేసులో రెండు రోజులుగా రంగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే వాచ్‌మెన్‌ రంగయ్య వివేకాహత్య కేసులో సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. దీంతో నార్కో పరీక్షలకు తరలించారు. 

ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంఘటన కూడా ప్రచారాస్త్రంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios