వివేకా హత్య కేసు.. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. సునీత విజ్ఞప్తితో..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే పిటిషనర్ సునీతా రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు. దీంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఇక, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని కేసులో ఏ-8గా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేంది. అయితే దీనిని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక, సిదార్థ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేసుకు సంబంధించి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.