వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన హత్య కేసులో మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు.

కాగా.. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి.. 62మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య జరిగినట్లు గుర్తించిన రోజు తొలుత హెడ్‌కానిస్టేబుల్‌ రామకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి కొన్ని సాక్ష్యాలు తారుమారు చేశారని పోలీసులకు సమాచారం అందడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ కి తరలించడం, రక్తపు మరకలు తుడవడం, కుట్లు వేయడం లాంటివన్నీ.. హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణా రెడ్డి దగ్గరుండి మరీ చేయించారని సమాచారం. దీంతో అతనిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.