విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి: విజయమ్మ పరామర్శ

కర్నూల్  నగరంలోని విశ్వబారతి  ఆసుపత్రిలో  వైఎస్ అక్ష్మిని వైఎస్ విజయమ్మ  పరామర్శించారు.  

YS Vijayamma  Visits  Kurnool  Viswa Bharathi hospital lns


కర్నూల్: నగరంలోని  విశ్వభారతి ఆసుపత్రిలో   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి  వైఎస్ లక్ష్మిని  వైఎస్  విజయమ్మ  సోమవారంనాడు  పరామర్శించారు. ఈ నెల  19వ తేదీన  వైఎస్ లక్ష్మిని  కర్నూల్  విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు  కడప ఎంపీ వైఎస్  అవినాష్ రెడ్డి.

ఈ నెల 19వ తేదీన  పులివెందులలో  వైఎస్ లక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో  చేర్పించారు.  అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైద్రాబాద్ కు తరలించాలని  భావించారు.  

ఈ నెల  19వ తేదీన  సీబీఐ విచారణకు  వెళ్లే సమయంలో తల్లికి అనారోగ్యంగా  ఉన్న విషయం  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సమాచారం  వచ్చింది.  దీంతో  సీబీఐ విచారణకు  వెళ్లకుండా  వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు  బయలుదేరారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు   సమాచారం  ఇచ్చారు  వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాదులు.

పులివెందులకు  వెళ్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి  అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద  తల్లి వస్తున్న అంబులెన్స్   ఎదురైంది.   అంబులెన్స్ లో  తల్లి వైఎస్ లక్ష్మిని   వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. అదే అంబులెన్స్ లో  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో వైఎస్ లక్ష్మిని  చేర్పించారుఅనారోగ్యంగా  ఉన్న  వైఎస్ లక్ష్మిని  సోమవారంనాడు సాయంత్రం  వైఎస్ విజయమ్మ పరామర్శించారు.  హైద్రాబాద్ నుండి వచ్చిన వైఎస్ విజయమ్మ  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రికి  చేరుకుని  వైఎస్ లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు   ఆసుపత్రిలో  ఉండి అక్కడి నుండి వైఎస్ విజయమ్మ తిరిగి హైద్రాబాద్ కు బయలుదేరారు. 

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  విచారణకు  రావాలని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ   నోటీసులు పంపింది. అయితే  సుప్రీంకోర్టులో  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు  చేసినట్టుగా  సీబీఐకి  అవినిష్ రెడ్డి  లేఖ  రాశారు.ఈ పిటిషన్ పై  రేపు విచారణ  జరగనుందని  ఆ లేఖలో  అవినాష్ రెడ్డి  పేర్కొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్  కు అవసరమైన భద్రతను కల్పించాలని  కర్నూల్ ఎస్పీని  సీబీఐ అధికారులు కోరారని సమాచారం. అయితే  ఈ విషయమై డీజీపీ నుండి ఆదేశాలు  అందిన తర్వాత   కర్నూల్ ఎస్పీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios