Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ వారసుడిని అంటావుగా... అయితే ఆన్సర్ చెయ్..: జగన్ కు షర్మిల సవాల్ 

ఎన్నికల వేళ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టిన వైసిపి ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. 

YS Sharmila challenge to CM YS Jagan over DSC Notification AKP
Author
First Published Feb 14, 2024, 7:14 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఇంతకాలం అధికారంలో వున్నది వైసిపి నే కదా... మరి ఎందుకు ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని ప్రశ్నించారు.  ఎన్నికలు రాగానే హడావిడిగా నోటిఫికేషన్ వేసారని... ప్రిపరేషన్ కు కూడా సమయం ఇవ్వకుండా పరీక్షల నిర్వహణకు సిద్దమయ్యారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన 52వేల టీచర్ పోస్టుల భర్తీని 'మెగా డిఎస్సి' అంటారు... ఇప్పుడు జగనన్న వేసింది 'దగా డిఎస్సి' అని షర్మిల ఎద్దేవా చేసారు. 

వైఎస్సార్ వారసుడినని చెప్పుకునే జగనన్న తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. అలాగే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసిపి నాయకులు, వీళ్ల సోషల్ మీడియా విభాగాలకు సవాల్ ... డిఎస్సి విషయంలో తాను సంధించే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. 

షర్మిల ప్రశ్నలు : 

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?

2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?

3. ఎన్నికలకు నెలన్నర  ముందు 6 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?

4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?
 
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్ కి 20 రోజులు, ఆ తర్వాత డీఎస్సీకి కేవలం 6 రోజుల సమయం ఇవ్వడమేంటి ? 

6.వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ?
 
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?

8.రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?

9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? 

నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న... ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని ఏపిసిసి చీఫ్ షర్మిల  సవాల్ చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios