దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy)జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి, షర్మిల నివాళులు అర్పించనున్నారు. కానీ.. గతేడాదిలా కాకుండా..ఈ సారి మాత్రం అన్న ,చెల్లెల్లు వేర్వేరుగా పాల్గొననున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) 74వ జయంతి రేపే. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి, షర్మిల నివాళులు అర్పించనున్నారు. కానీ.. ప్రతిసంవత్సరం కుటుంబ సభ్యులందరూ కలిసే నివాళులర్పించినా.. ఈ సారి మాత్రం అన్న జగన్మోహన్ రెడ్డి, చెల్లి షర్మిల ఎవరికి వారే విడివిడిగా పాల్గొననున్నారు. సోదరిసోదరులు పూర్తిగా వేర్వేరు సమయాల్లో ఇడుపులపాయలోని ఘాట్‌కు చేరుకోనున్నారు.
సోదరి షర్మిల శుక్రవారం మధ్యాహ్నం తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రికి శనివారం (8వ తేదీ) ఉదయమే నివాళి అర్పించి.. అనంతరం హైదరాబాద్‌కు వెళతారని సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని శుక్రవారం(8న) మధ్యాహ్నం ఇడుపుల పాయ చేరుకోనున్నారు. దాదాపు 2 గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్ వద్ద చేరుకుని నివాళులు అర్పించనున్నారు.
వేర్వేరుగా నివాళులు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడం గత కొన్ని సంవత్సరాలుగా
ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులందూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారు. సీఎం జగన్, షర్మిల మధ్య గత విభేదాలున్నప్పటికీ గతేడాది ఇద్దరూ తన తల్లితో కలిసి ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు.
కానీ.. ఈసారి ఆనవాయితీకి జగన్ పుల్ స్టాప్ పెట్టినట్టు అనిపిస్తుంది. జయంతి రోజున ఉదయం కాకుండా మధ్యాహ్న ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకోవడం కాస్త సందేహంగానే ఉంది. సోదరి షర్మిలకి ఎదురు పడటం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అనే సందేహాలు రాకమానడం లేదు. అలాగే.. ఈ కార్యక్రమంలో జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి విదేశీ పర్యటనలో ఉండటం చర్చనీయంగా మారింది.
ఇక, సీఎం జగన్ మూడు రోజులపాటు కడప జిల్లాలోనే పర్యటించనున్నారు. ఆయన తండ్రి జయంతి సందర్భంగా శనివారం కళ్యాణదుర్గం నుంచి ప్రత్యేక హెలికాప్టరులో ఇడుపులపాయ చేరుకుంటారు. నివాళులర్పించిన అనంతరం సింహాద్రిపురం లోకల్ లీడర్స్ తో ప్రత్యేక భేటీ కానున్నారు. ఇక 9న ఉదయం గండికోట చేరుకుని ఒబెరాయ్ హోటల్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని పలు అభివ్రుద్ది కార్యక్రమాలు, భవన నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఇక 10న కడపలో రాజీవ్‌మార్గ్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తికి వెళ్లి డిక్సన్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.
