అమరావతి: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు భారత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మోడీకి లేఖ రాశారు. పలు భాషల్లో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటనలను, బాలు పొందిన పద్మ భూషణ్ అవార్డును, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆయన లేఖలో ప్రస్తావించారు. 

ఎస్బీ బాలు ఎంతో మంది వర్ధమాన గాయకులను పరిచయం చేయడంతో పాటు 50 ఏళ్ల పాటు సంగీత ప్రేమికులను అలరించారని ఆయన అన్నారు. మాతృభాషలో 40 వేలకు పైగా పాటలు పాడిన బ ాలు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో గీతాలు ఆలపించారని ఆయన చెప్పారు. 

ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు పొదారని ఆయన చెప్పారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 అవార్డులను పొందడమే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అవార్డులు పొందారని ఆయన అన్నారు. 

భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ అవార్డును, 2011లో పద్మభూషణ్ అవార్డును ఎస్పీ బాలుకు ప్రదానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ నేపథ్య గాయకులు లతా మంగేష్కర్, భూపెన్ హజారికా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేనే జోషీలకు భారత రత్న అవార్డులను ఇచ్చారని చెప్పారు.