హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరనేది ప్రముఖ రచయిత, టీడీపీ మాజీ  రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తేల్చేశారు. ఏపీలో ఈసారి జగన్ కచ్చితంగా సీఎం అవుతారని స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏపీకి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాజన్న రాజ్యం రావాలంటే అది వైఎస్ జగన్ తోనే సాధ్యమంటున్నారు. తెలుగుభాష బాగుపడాలంటే జగన్ అధికారంలోకి రావాలని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేకర్ రెడ్డి హయాంలో తెలుగుద భాషకు ప్రాచీన హోదా దక్కితే ఆ భాషను తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు వెలుగు సాధ్యపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మంచి పాలన అందిస్తారని కూడా యార్లగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు.