జగన్ కరోనా వ్యాక్సిన్: ఏడు కిలోమీటర్ల పొడవు బారికేడ్లు, ఇళ్లలోనే బందీలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఆయన కరోనా వ్యాక్సిన్ గుంటూరు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన గుంటూరు ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. గుంటూరులోని భారత్‌పేట వార్డు సచివాలయంలో సీఎం జగన్ గురువారం వ్యాక్సిన్ వేయించుకునేందుకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం ఓ అరగంటపాటు ఇక్కడ ఉంటారు.
అయితే పోలీసు బందోబస్తు పేరుతో ఈ వార్డు సచివాలయ పరిసర ప్రాంత వాసులే కాకుండా దారి పొడవునా ఇరు వైపులా ఇళ్లలో నివసించే వారు సైతం బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచే సుమారు ఏడు కిలోమీటర్ల పొడవున బారికేడ్లు ఏర్పాటు చేశారు.
గురువారం సాయంత్రం వరకు వాటిని అలాగే ఉంచనున్నారు. అంటే సుమారు 30 నుంచి 40 గంటలపాటు ఆ ప్రాంత వాసులు ఇళ్లలో బందీలగా ఉండిపోవాల్సిందే. సీఎం కార్యక్రమం జరిగే సచివాలయం చుట్టుపక్కలైతే ఇనుప ఫెన్సింగ్ పెట్టారు.
సీఎం పర్యటన సందర్భంగా పది మంది డీఎస్పీలు, 30 మం ది సీఐలు, 59 మంది ఎస్‌ఐలు, 147 మంది ఏఎ్‌సఐలు, 645 మంది కానిస్టేబుళ్లను భద్రతా ఏర్పాట్ల కోసం నియమించారు.