హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి రేపు లండన్‌‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి జగన్ కుటుంబంతో కలిసి హైదరబాద్‌‌కు బయల్దేరనున్నారు. ఐదు రోజుల పాటు లండన్‌‌లోనే ఆయన గడపనున్నారు. 

లండన్ పర్యటన ముగించుకుని ఈ నెల 22వ తేదీ రాత్రికి హైదరాబాద్‌‌ చేరుకోనున్నారు. కాగా.. జగన్ కుమార్తె వర్ష లండన్‌‌లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆమె విద్యాభ్యాసం చేస్తున్నారు. 

కూతురును చూసేందుకు కుటుంబసమేతంగా జగన్ లండన్ వెళ్తున్నారు. ఇటీవలే జగన్ ఏడాదిపాటు ఏపీలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ ముగించుకున్న ఆయన హైదరాబాదులో ఉంటున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.