శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. రాజకీయ నాటకంలో చంద్రబాబు కుట్రపూరిత  కూటములు కడుతున్నారని విమర్శించారు. 

కొత్త మిత్రులను వెతుకుతూ రాషట్రాలు పట్టుకుని తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన విషయం తమకు తెలుసునన్నారు. 

కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఎలాంటి ఉద్యమాలు చేశామో తమకు తెలియకపోవచ్చు కానీ ప్రజలకు తెలుసునన్నారు. వైసీపీ చేసిన నిరంతర పోరాటం రాష్ట్రప్రజలకు సుపరిచితమేనన్నారు. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని జగన్ విమర్శించారు.