తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారందరి ఇంటా భోగ భాగ్యాలూ సిరిసంపదలూ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.