అమరావతి:  తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

మంత్రి ఆళ్ల నాని రుయా ఆస్పత్రి సూపరింటిండెంట్ తో మాట్లాడారు. సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూపరింటిండెంట్ డాక్టర్ భారతి ఘటనపై ఆళ్ల నానికి వివరాలు అందించారు. ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రుయా ఆస్పత్రిలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగులకు అందని ఆక్సిజన్ : 11 మంది రోగుల మృతి

రుయాలో రాత్రి 8. గంటలకు  5 నిముషాల సేపు ఆక్సిజన్ ప్రెసర్ జరిగిందని, వెంటనే డాక్టర్లు అప్రమత్తం తో పెద్ద ప్రమాదం తప్పిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరిననారాయణన్ చెప్పారు.అంతలోపే  11 మంది ప్రాణాలు పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

ఏ విధమైన ఇబ్బంది కూడా లేదని, ప్రత్యామ్నాయంగా బల్క్ సిలిండర్లు అందుబాటులో పెట్టామని ఆయన చెప్పారు వాటివల్లనే పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. 

వేయి మంది రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆస్పత్రిలో 700 వరకు పడకలున్నాయని ఆయన చెప్పారు. 30 మంది వైద్యులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు