తిరుపతి: గతంలో పలుసార్లు తిరుపతి వచ్చినా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేరాలని బాలాజీని వేడుకుంటున్నానని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ప్రజా ధన్యవాద సభలో ప్రసంగించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా మోడీ వైఎస్ జగన్ భుజం తట్టారు. మంత్రులను, నేతలను జగన్ మోడీకి పరిచయం చేశారు.

ప్రధాని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బాలాజీ పాదపద్మాల సాక్షిగా మళ్లీ తనకు అధికారం అప్పగించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు. పార్టీ గెలుపుఓటములను పక్కనపెట్టి ఏపీ, తమిళనాడు కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయడం ముదావహమని కొనియాడారు. బీజేపీ కార్యకర్తలు ఆశావహులని భారత్‌ మాతా కీ జై అంటూ పార్టీని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా పనిచేస్తున్నారని అన్నారు.

"