న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు భేటీ అయ్యారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్ కు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ధిక శాఖ కూడ ఈ విషయమై  ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ విషయమై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.  ఈ విషయమై తక్షణమే సహాయం అందించాలని జగన్ కోరే అవకాశం ఉందని సమాచారం.

ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకొన్న జగన్ ఇవాళ రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు.ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం కూడ సీఎం ప్రయత్నిస్తున్నారు.  ప్రధాని అపాయింట్ మెంట్ లభిస్తే జగన్ రేపు మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.