ఆంధ్రప్రదేశ్ తుఫానుతో అల్లాడుతుంటే జగన్ విహార యాత్రలు చేస్తారని, సినిమాలకు వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ప్రభావం జగన్ తన పర్యటనను రద్దు చేసుకోవడం వెనక ఉండవచ్చునని భావిస్తున్నారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటన రద్దయింది. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా పర్యటన రద్దయింది. అయితే ఆయన పర్యటన ఎందుకు రద్దయిందనేది తెలియాల్సి ఉంది. 

కాగా, ఆంధ్రప్రదేశ్ తుఫానుతో అల్లాడుతుంటే జగన్ విహార యాత్రలు చేస్తారని, సినిమాలకు వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ప్రభావం జగన్ తన పర్యటనను రద్దు చేసుకోవడం వెనక ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే అసలు కారణం మాత్రం తెలియదు. 

శనివారం నుంచి ఈ నెల 14వరకు జగన్ లండన్‌లోనే ఉండాల్సి ఉంది. జగన్ కూతురు లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా ఆయన కూతురు వద్దకు వెళ్లాలని అనుకున్నారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా సమయం ఉండటంతో మరోమారు విదేశాల్లో విహారయాత్రకు జగన్ వెళ్తున్నారని, తిరిగి మళ్ళీ 14వ తేదీ హైద్రాబాద్‌కు వైఎస్ జగన్ చేరుకోనున్నారని వార్తలు వచ్చాయి.