Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కరోనా వ్యాక్సిన్‌పై సీఎం జగన్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో  కరోన వ్యాక్సిన్‌కు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య విధానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విధంగా సమాధానమిచ్చారు. 

YS Jagan key statement on corona vaccine in AP Assembly sessions - bsb
Author
Hyderabad, First Published Dec 5, 2020, 12:19 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో  కరోన వ్యాక్సిన్‌కు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య విధానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విధంగా సమాధానమిచ్చారు. 

కేంద్రం మొదటి విడతలో రాష్ట్రానికి కోటిమందికి సరిపడా టీకాలను సరఫరా చేయనుందని.. టీకా నిల్వ, సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించిందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం టీకా వచ్చేందుకు 3, 4 నెలలు సమయం పడుతుందన్నారు. 

టీకాలు వేయడంలో ఆశ వర్కర్లకు శిక్షణ ఇస్తామని.. మొదటివిడతలో 3.60 లక్షల వైద్యసిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది 7 లక్షలు, 50 ఏళ్లు పైబడిన 90 లక్షల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీకా నిల్వ కోసం ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు సిద్ధం చేశామన్నారు.. మిగిలిన ఏర్పాట్లు చేశామన్నారు.

కరోనాపై గత 9 నెలలుగా యుద్ధం చేస్తున్నామన్నారు సీఎం జగన్. మరికొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాలని.. ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌ లాక్‌డౌన్‌లో ఉన్నాయని.. టీకా అందరికీ సరఫరా చేయడం ఇప్పుడు కుదరదు అన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌ల్లో కేసులు పెరుగుతున్నాయని.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల్లో రాత్రిపూట కర్ఫ్యూ పెడుతున్నారని చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios