అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను జగన్ నాశనం చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పీపీఏలను పున: సమీక్షించాలనన జగన్ తీసుకున్న నిర్ణయం, జపాన్ ప్రభుత్వం ఆగ్రహం వంటి పరిణామాలపై మోహన్ దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందంటూ మండిపడ్డారు.  

ఏపీలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పీపీఏలపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయంపై మోహన్ దాస్ పాయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన విమర్శలను నేరుగా జగన్‌ ట్విట్టర్ కు ట్యాగ్ చేశారు.

ఏపీలో ప్రభుత్వం ట్రెరిరిజం కొనసాగుతోందని మండిపడ్డారు. పీపీఏల సమీక్ష రాష్ట్ర భవిష్య‌కు మంచిదికాదన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయంటూ నిలదీశారు. జపాన్ పరిశ్రమ కంపెనీలు లేఖలు రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా అంటూ ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్రంలోని పలు కంపెనీల్లో ఆయన ఇండిపెండెంట్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాదంటూ చెప్పుకొచ్చారు.  జగన్ తన నిర్ణయాలవల్ల ఏపీ భవిష్యత్‌ నాశనం అయ్యే ప్రమాదం ఉందని అలా చేయోద్దంటూ హితవు పలికారు. పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ భవిష్యత్‌ను జగన్ నాశనం చేస్తున్నారంటూ మోహన్ దాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే పీపీఏలు, రివర్స్ టెండరింగ్ అంశాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జూన్ నెలలో మోహన్ దాస్ పాయ్ బహిరంగ లేఖ రాశారు. మోహన్ దాస్ పాయ్ కర్ణాటకలో ప్రముఖ పారిశ్రామికవేత్త. అక్షయపాత్ర సహ వ్యవస్థాపకులు.