అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు హైకోర్టుకు చేరుకుంది. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని హైకోర్ట్ ను ఆశ్రయించారు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. 

తన బాబాయ్ హత్య కేసును చిన్నదిగా చూపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ పిటీషన్లో పేర్కొన్నారు. 
వ్యక్తిగత ప్రయోజనాల కోసం హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. 

స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.