Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ భారతికి భారీ వేతనం: ఎంతంటే...

భారతి సిమెంట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చైర్‌పర్సన్‌ కాకముందు భారతికి క్లాసిక్‌ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి మాత్రమే వేతనం వచ్చేదని ఈడీ తెలియజేసింది. భారతి 2009-10లో 42 లక్షలు, 2008-09లో 43.50 లక్షలు, 2007-08లో 42 లక్షలు, 2006-07లో 17.5 లక్షలు చొప్పున జీతం తీసుకున్నారు. 

YS Bharathi salary is very high
Author
Hyderabad, First Published Aug 12, 2018, 11:09 AM IST

హైదరాబాద్‌: భారతి సిమెంట్స్ చైర్ పర్సన్ గా ఉన్న వైఎస్ భారతి భారీ వేతనం తీసుకుంటున్నట్లు ఈడీ అభియోగ పత్రాన్ని బట్టి తెలుస్తోంది. భారతి సిమెంట్స్ లో మెజారిటీ షేర్‌ (51 శాతం) ఉన్న పర్‌ఫిసిమ్‌ కంపెనీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్‌ డైరెక్టర్లకంటే ఎక్కువ వేతనం భారతి తీసుకుంటున్నారని ఈడీ తెలిపింది. 

భారతి సిమెంట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చైర్‌పర్సన్‌ కాకముందు భారతికి క్లాసిక్‌ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి మాత్రమే వేతనం వచ్చేదని ఈడీ తెలియజేసింది. భారతి 2009-10లో 42 లక్షలు, 2008-09లో 43.50 లక్షలు, 2007-08లో 42 లక్షలు, 2006-07లో 17.5 లక్షలు చొప్పున జీతం తీసుకున్నారు. 

సండూర్‌ పవర్‌ నుంచి 2005-06లో 11 లక్షలు, 2006-07లో 6 లక్షలు చొప్పున భారతికి వేతనం లభించింది. 2010 డిసెంబరు 12న ఆమె భారతి సిమెంట్స్ చైర్‌పర్సన్‌ అయ్యారు. సిమెంట్‌ రంగంలో ఆమెకు ఎలాంటి అనుభవం లేదని, అయినా ఆమె రూ.3.90 కోట్లు వార్షిక వేతనం తీసుకుంటున్నారని ఈడీ వివరించింది.
 
భారతి సిమెంట్స్ సంస్థలో మెజారిటీ వాటా ఉన్న కంపెనీల ప్రొఫెషనల్‌ డైరెక్టర్లకు భారతి వేతనంలో సగం మాత్రమే కావడం గమనార్హమని ఈడీ తెలిపింది. 2011 నుంచి 2015 వరకు ప్రతి ఏటా రూ.3.90 కోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ.19.50 కోట్లు తీసుకున్నారని, ఇదంతా నేరపూరిత చర్యల ద్వారా లభించిన ఆర్థిక ప్రయోజనమేనని ఈడీ వివరించింది. 

భారతి సిమెంట్‌ లిమిటెడ్‌లో జగన్‌కు ఉన్న షేర్లు, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల నేపథ్యంలోనే ఆయన సతీమణికి ఇంత పెద్ద మొత్తంలో వేతనం సాధ్యమైందని తెలిపింది. అంతే కాకుండా, జగన్‌ సన్నిహితుడు జెల్లా జగన్‌ మోహన్‌ రెడ్డి 2009 నుంచి 2015 మధ్య కాలంలో 7.18 కోట్ల భారీ వేతనం పొందారని తెలిపింది.
 
కడప జిల్లాలో 2037.52 ఎకరాలలో విస్తరించిన సున్నపు గనుల లీజు గుజరాత్‌ అంబుజా సిమెంట్‌ లిమిటెడ్‌కు పునరుద్ధరించకుండా వైఎస్‌ జగన్‌, ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఆ గనులను వారేదక్కించుకున్నారని, 2006 మార్చి 27న ఈ జీవో వెలువడిందని తెలిపింది. 

2037.52 ఎకరాలలో 475.16 ఎకరాల్లో నాణ్యమైన సున్నపు రాయి లేదంటూ ప్రభుత్వానికి తిరిగి అప్పగించారని, లీజుకు పొందిన గనుల్లో 2009 వరకు సున్నపు రాయిని వెలికి తీయలేదని చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios