Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఈ రోజు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు.

YS Avinash reddy appears before CBI Court in Hyderabad over YS Viveka Murder Case ksm
Author
First Published Aug 14, 2023, 11:53 AM IST

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఈ రోజు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా  ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి లను కూడా అధికారులు కోర్టులో హాజరుపరిచారు.  వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. 

ఇక, వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందుతుడిగా పేర్కొంది. వివేకానందరెడ్డి హత్యకు పథకం పన్నినట్లు అవినాష్‌రెడ్డిపై అభియోగాలు మోపింది. అవినాష్ రెడ్డి.. తన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులతో కలిసి నేరస్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాడని సీబీఐ పేర్కొంది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. సీబీఐ డైరెక్టర్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో దర్యాప్తును పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై లేఖలో ఆరోపణలు గుప్పించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై అవినాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios