కర్నూలు జిల్లాలో అల్లరి మూక రెచ్చిపోయింది. కొందరు యువకులు పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కర్నూలు జిల్లాలో అల్లరి మూక రెచ్చిపోయింది. కొందరు యువకులు పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. వివరాలు.. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు. ఓ యువకుడు బలవంతంగా విద్యార్థిని ముద్దు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న తోటి విద్యార్థులు తిరగబడటంతో అల్లరి చేస్తున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధిత విద్యార్థిని.. ఈ ఘటనకు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే రెండు రోజులు గడిచిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోకిరీలు బడా బాబుల పిల్లలు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయాలనే స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.