Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పెళ్లి.. కాదు పొమ్మని ప్రియురాలి మరో వివాహం.. చివరకు..

ఈ విషయం తెలుసుకొని బాలాజీ కూడా విజయవాడ చేరుకున్నాడు. అక్కడ ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉండటం మొదలుపెట్టారు.

Youth Commits suicide After love Failure in Vijayawada
Author
Hyderabad, First Published Feb 8, 2021, 7:29 AM IST

ప్రాణం కన్నా ఎక్కువగా ఓ బాలికను ప్రేమించాడు. ఆమె కూడా అతనిని ప్రేమించింది. పెద్దలకు తెలీకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో.. ఇద్దరినీ దూరంగా ఉంచారు. ఈ క్రమంలో.. బాలిక మరో వ్యక్తితో ప్రేమలో పడి.. అతనిని కూడా పెళ్లి చేసుకుంది. ఈ విషయం సదరు యువకుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రియురాలిని తాను దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే.. ఏ ప్రయత్నం ఫలించలేదు. దీంతో.. చేసేది లేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బాలాజీ(32) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. తమిళనాడులోని ఓ హోటల్ లో పనిచేసేవాడు. ఆతర్వాత అక్కడి నుంచి విశాఖకు చేరుకున్నాడు. ఆ సమయంలో ఓ బాలిక తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే.. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో.. ఆమెను విశాఖ నుంచి విజయడాకు పంపించి అక్కడ హాస్టల్ లో  చేర్పించారు. ఈ విషయం తెలుసుకొని బాలాజీ కూడా విజయవాడ చేరుకున్నాడు. అక్కడ ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉండటం మొదలుపెట్టారు.

సరిగ్గా ఈ క్రమంలోనే బాలికకు మరో వ్యక్తితో పరిచయం, ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఈ విషయం బాలాజీకి తెలియడంతో నానా రభస చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయిని తాను దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే.. ఏ ప్రయత్నం దక్కలేదు. పలుమార్లు అతనికి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా.. అతనిలో మార్పు రాలేదు. 

సదరు బాలిక కోసం ఓసారి ఆమె ఉంటున్న భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. ఈ క్రమంలో పోలీసులు బాలిక, బాలాజీ ఇద్దరినీ ప్రశ్నించగా.. అతనితో ఉండటం తనకు ఇష్టం లేదని బాలిక తేల్చి చెప్పింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. బాలిక తనకు దక్కకపోవడంతో సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios