వీరి మధ్య గత కొంతకాలంగా Extramarital affair కొనసాగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కాగా యువకుడు, మహిళా ద్విచక్రవాహనంపై లక్కిరెడ్డిపల్లి నుంచి నందివాళ్ల పల్లె రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వినోద్ తెలిపారు.  

వైఎస్ఆర్ కడప : ఓ యువకుడు, మహిళా కలిసి suicide attempt చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట మండలంలోని లక్కిరెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. నాగేంద్ర (21) అనే యువకుడు, రుక్మిణి (35)అనే మహిళ లక్కిరెడ్డిపల్లె మండలంలోని కొండ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే వీరి మధ్య గత కొంతకాలంగా Extramarital affair కొనసాగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కాగా యువకుడు, మహిళా ద్విచక్రవాహనంపై లక్కిరెడ్డిపల్లి నుంచి నందివాళ్ల పల్లె రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వినోద్ తెలిపారు.

ఈ మేరకు ఇరువురి బంధువులను పిలిపించి వారు ఇచ్చిన సమాచారం మేరకు dead bodiesను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై 
Postmortem నిర్వహించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, మహబూబ్ నగర్ లో గత నెల నవంబర్ 9న ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని కలిగిన యువతితో కలిసి అతడు ఓసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వివాహిత చనిపోగా అతడు మాత్రం బ్రతికాడు. అయితే ప్రియురాలి మృతిని తట్టుకోలేకపోయిన అతడు తాజాగా మరోసారి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... mahabubnagar district దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఎక్లాపూర్ గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్లక్రితం వివాహమైంది. అయితే పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో భార్య అంగీకారంతోనే ఆమె చెల్లి అక్షిత(25) ను ఆంజనేయులు పెళ్లాడాడు. వీరికి మూడేళ్ల కొడుకు వుండగా అక్షిత ఏడు నెలల గర్భిణి. 

Bus Accident In Prakasam : ఏపీలో మ‌రో పెను ప్ర‌మాదం .. అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన ముప్పు

అయితే అదే గ్రామానికి చెందిన మధు(20) అనే యువకుడితో అక్షితకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతరసంబంధానికి దారితీసింది. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ గత నెల(అక్టోబర్) చివర్లో మధు, అక్షిత ఒకేగదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ కాపాడి కొనఊపిరితో వున్న వారిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అక్షిత ప్రాణాలు కోల్పోయింది.

మధు మాత్రం కొన్నిరోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన అతడిని కుటుంబసభ్యులు అడ్డాకుల మండలం గుడిబండలోని పెద్దమ్మ జయమ్మ ఇంట్లో వుంచారు. అయితే ప్రియురాలి జ్ఞాపకాలతో తీవ్ర డిప్రెషన్ కు లోనయిన మధు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటిముందున్న చెట్టుకు అర్ధరాత్రి ఉరేసుకోగా తెల్లవారుజామున అతడి పెద్దమ్మ గుర్తించింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

వెంటనే మధు తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.