విజయవాడ దేవినేని గాంధీపురంలో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన డిడి సురేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తల్లిదండ్రులు లేకుండా అనాధగా బ్రతకలేనంటూ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడికి మెసేజ్ చేసినా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. 

తల్లితండ్రులు లేని జీవితం వృధా అంటూ సురేష్ పంపించిన సంక్షిప్త సందేశాన్ని చూసిన స్నేహితుడు వెంటనే అతడి నివాసానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే సురేష్ ఉరివేసుకున్నాడు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

స్థానికంగా మంచి పేరున్న సురేష్ ను చూసేందుకు వచ్చిన జనం కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే సురేష్ మృతిపై సందేహాలు వుండటంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.